హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో స్పోర్ట్స్ ఫెస్ట్ శుక్రవారం ప్రారంభమైంది. ఐబీఎస్‌కు చెందిన స్పోర్ట్స్ అండ్స్ ఫిట్నెస్ క్లబ్ ‘టీమ్ వీపీఎస్’ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. ‘మేకిట్ హ్యాపెన్’ లాంటి వినోదభరితమైన ఈవెంట్‌తోపాటు క్వీన్స్ గాంబిట్ పేరుతో ఆన్లైన్ చెస్ టోర్నమెంట్, క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆఫ్‌లైన్‌లో ఐబీఎస్ గ్రౌండ్స్‌లో పురుషులు, మహిళల సింగిల్స్, మెన్, ఉమెన్, మిక్స్డ్ డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరిగింది. కొవిడ్-19 నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న బిజినెస్ స్కూళ్లు ఆన్లైన్ ద్వారా ఇందులో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు.