Akash Chopra | మయాంక్‌ను కెప్టెన్ చేసి అతనిపై ఒత్తిడి పెంచొద్దు.. ఎస్ఆర్హెచ్కు మాజీ క్రికెటర్ సలహా
మయాంక్‌ను కెప్టెన్‌గా చేసి ఒత్తిడి పెంచవద్దని ఆకాశ్ సలహా
Akash Chopra : ఐపీఎల్ 2023 సీజన్లో అద్భుత ప్రదర్శన చేయాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ భావిస్తోంది. అందుకని వేలంలో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను వేలంలో దక్కించుకుంది. ఈ సీజన్లో ఆ జట్టు మయాంక్‌ను కెప్టెన్‌గా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. అతడిని కెప్టెన్‌గా చేసి ఒత్తిడి పెంచవద్దని ఎస్ఆర్హెచ్ యాజమాన్యానికి మాజీ క్రికెటర్ ఆశాశ్ చోప్రా సలహా ఇచ్చాడు. అతడి బదులు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని అతను అభిప్రాయపడ్డాడు. మయాంక్‌ను కెప్టెన్ చేయొద్దు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ… ‘ఎస్ఆర్హెచ్ ఈసారి భువీని కెప్టెన్ చేయాలి. మయాంక్ ఒక ఆప్షన్ మాత్రమే. ఎందుకంటే.. అతను చాలా అద్భుతంగా ఆడతాడు. కానీ, కెప్టెన్‌గా ఉన్న సీజన్లో పరుగులు సాధించలేదు. అందుకని కెప్టెన్ చేసి అతడిపై ఒత్తిడి పెంచొద్దు’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు. అని ఆకాశ్ చోప్రా అన్నాడు. వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మయాంక్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది.
గత ఐపీఎల్ సీజన్లో మయాంక్ అగర్వాల్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా చేశాడు. ఆ సీజన్లో అతను తీవ్రంగా నిరాశ పరిచాడు. మరోవైపు ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో సరైన కెప్టెన్ కోసం చూస్తోంది. గత ఏడాది విలియమ్సన్, డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఆ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ, వాళ్లిద్దరూ ఆశించినంత రాణించకపోవడంతో రిలీవ్ చేసింది. ఈ ఏడాది ట్రోఫి సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకోసం వేలంలో ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ కోసం అత్యధికంగా రూ.13.25 కోట్లు, దక్షిణాఫ్రికా ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం రూ.5.25 కోట్లు పెట్టింది. మయాంక్, హ్యరీ బ్రూక్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

