కెప్టెన్సీ నాకు ఇస్తారనుకున్నా కానీ ధోనీకి ఇచ్చారు!

న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్‌లో స్టైలిష్ బ్యాట్స్‌మన్‌గా, ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్‌కు ఆశించిన పేరు రాలేదనే చెప్పాలి. అతడో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 2007, 2011 వరల్డ్‌కప్‌లలో టీమిండియా గెలవడంతో యువీదే కీలకపాత్ర. కెరీర్లో మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అతడే కెప్టెన్ అవుతాడని అంతా భావించారు. నిజానికి తాను కూడా కెప్టెన్సీ తనకే దక్కుతుందని భావించినట్లు తాజాగా గౌరవ కపూర్ షో 22 యార్న్స్ పాడ్‌కాస్ట్‌లో యువీ అన్నాడు. అయితే తనను కాదని ధోనీకి కెప్టెన్సీ ఇచ్చారని అతడు చెప్పాడు.
నిజానికి 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్సీ తనే దక్కుతుందని తాను భావించినట్లు యువీ తెలిపాడు. ఆ ఏడాది ఇండియా 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో ఓడిపోయింది. ఇండియన్ క్రికెట్లో గందరగోళం నెలకొన్నది. అదే సమయంలో ఇంగ్లండ్‌లో రెండు నెలలు, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌లలో ఒక నెల పర్యటనలు ఉన్నాయి. ఆ తర్వాత నెల రోజులు టీ20 వరల్డ్‌కప్. అంటే మొత్తంగా నాలుగు నెలలు ఇండియా బయటే ఉండాలి. ఆ సమయంలో సీనియర్లు రెస్ట్ కావాలనుకొని టీ20 వరల్డ్‌కప్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. దీంతో కెప్టెన్సీ నాకే దక్కుతుందని అనుకున్నాను. కానీ ధోనీ పేరును ప్రకటించారు అని యువీ చెప్పాడు.
కెప్టెన్సీ సమస్య ఉన్నా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగాయా అని ప్రశ్నించగా.. అంతేకదా. కెప్టెన్ ఎవరైనా వాళ్లకు మద్దతివ్వాల్సిందే. రాహుల్ అయినా, గంగూలీ అయినా, భవిష్యత్తులో ఎవరైనా సరే. చివరికి ఓ టీమ్ మనిషిగా ఉండాలి. నేను అలాగే ఉన్నాను అని యువీ చెప్పాడు. ధోనీ కెప్టెన్సీలోనే ఇండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించడంలో యువీదే కీలకపాత్ర. 2007 వరల్డ్‌కప్‌లోనే యువీ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

