న్యూఢిల్లీ, మే 27: పన్ను రిటర్నులకు సంబంధించి ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ ఐటీఆర్-2 ఫారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026-27 మదింపు సంవత్సరానికిగాను ఐటీఆర్-2 ఆన్లైన్ ఫైలింగ్, ఎక్సెల్ యుటిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తన ఎక్స్‌లో పేర్కొంది.
చిన్న, మధ్యస్థాయి ఆదాయం పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీఆర్-1, ఐటీఆర్-4ను గతంలోనే తీసుకొచ్చింది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఇండ్లు, స్థలాల అమ్మకం ద్వారా మూలధన లాభాలు లేదా నష్టాలు వచ్చిన వారు, విదేశాల నుంచి ఆదాయం పొందుతున్నవారు ఐటీఆర్-2ని రిటర్నులు దాఖలు చేయాల్సివుంటుందని పేర్కొంది.