బెంగుళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)పై సోషల్ మీడియా వెరైటీ రూమర్స్ నడుస్తున్నాయి. ఆర్సీబీ జట్టులో అయిదుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారని, దాంట్లో విరాట్ కోహ్లీ కూడా ఒకరని ఆన్లైన్లో ట్రోల్స్ జరుగుతున్నాయి. చాన్నాళ్ల నుంచి విరాట్ లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో అతనిపై ఆ పుకార్లు పుట్టాయి. అయితే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న జోక్స్ అతను చెక్ పెట్టేశాడు. తానేమీ ఓవర్సీప్ ప్లేయర్ కాదన్నారు. ఆర్సీబీ హోస్ట్ దనిష్ సైత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. ఆర్సీబీ జట్టులో అయిదుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారని విమర్శలు వస్తున్నట్లు హోస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. ఆ ప్రశ్నకు కోహ్లీ నవ్వుతూ.. నాకు తెలియదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, విదేశీ ఆటగాళ్లను అడగండి, నేనేమీ విదేశీ ప్లేయర్‌ను కాదు, నేనేమైనా ఓవర్సీస్ ప్లేయర్‌నా అని కోహ్లీ ఎదురు ప్రశ్న వేశారు.
2026 ఐపీఎల్లో హైదరాబాద్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ 38 బంతుల్లో 69 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతను అయిదు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ టాప్ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. కానీ, అతను జనవరిలో చివరి వన్డే ఆడిన తర్వాత నేరుగా లండన్‌కు వెళ్లిపోయాడు. అక్కడే అతను తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నాడు. ఇండియాను అతను రాలేదు. దీంతో కోహ్లీ ఓ విదేశీ ప్లేయర్ అయిపోయినట్లు సోషల్ మీడియాలో అతనిపై విమర్శలు వచ్చాయి. ఇక గత ఏడాది ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న తర్వాత తన మనసు తేలికైందన్నారు. అయితే వంద శాతం ఫిట్నెస్ లేకుంటే తాను క్రికెట్ మైదానంలో అడుగుపెట్టబోనన్నాడు. 120 శాతం ఫిట్నెస్తోనే ఆడనున్నట్లు తెలిపాడు. ఎక్స్ట్రా రెస్ట్ తీసుకున్నానంటే, అది తనను మానసికంగా బలోపేతం చేస్తుందని అన్నారు.
Will AI finally take Mr. Nags’s job? 𝗟𝗮𝘀𝘁 𝗡𝗮𝗴𝘀 𝘅 𝗩𝗶𝗿𝗮𝘁 𝗩𝗶𝗱𝗲𝗼?? 🤯🤯🤯
In this episode of 𝗥𝗖𝗕 𝗜𝗻𝘀𝗶𝗱𝗲𝗿 𝘄𝗶𝘁𝗵 𝗠𝗿. 𝗡𝗮𝗴𝘀 𝗳𝘁. 𝗩𝗶𝗿𝗮𝘁 𝗞𝗼𝗵𝗹𝗶 the OG legends of ‘uru talk about haircuts, speculations on Social Media, and Virat’s debut in… pic.twitter.com/vvUcaSo3cu
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 4, 2026