గువహటి: హైదరాబాదీ షట్లర్ తరుణ్ మన్నెపల్లి గువహటి మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తరుణ్.. 21-13, 21-16తో సహచర ఆటగాడు లువాంగ్ మైస్నమ్ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో 8వ సీడ్ తన్వి శర్మ.. 21-17, 21-13తో ఫన్నాచెట్ (థాయ్‌లాండ్)ను వరుస గేమ్స్‌లో చిత్తుచేసి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
కానీ ఐదో సీడ్ అన్మోల్ ఖర్బ్.. 21-16, 17-21, 16-21తో భారత్‌కే చెందిన అష్మిత చలిహా చేతిలో ఖంగుతింది. ఇషారాణి, అనుపమ ఉపాధ్యాయ, తన్య హేమంత్, దయానంద్ తమ ప్రత్యర్థులను ఓడించి క్వార్టర్స్‌కు ప్రవేశించారు.