Ranji Trophy | డెహ్రాడూన్: హైదరాబాద్, ఉత్తరాఖండ్ మధ్య రంజీ గ్రూపు-బీ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. హైదరాబాద్ బౌలర్లు రోహిత్ (2/20), కార్తీకేయ (1/24), మిలింద్ (1/29), అనికేత్ (1/56) ధాటికి ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 189/5 పరుగులు చేసి 222 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 244/5తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన హైదరాబాద్ 292 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (94) రాణించాడు. దీపక్ హుడా (5/51) ఐదు వికెట్లతో విజృంభించాడు.