హైదరాబాద్, ఆట ప్రతినిధి: స్థానిక జింఖాన మైదానం వేదికగా హైదరాబాద్, గుజరాత్ మధ్య గ్రూపు-బీ రంజీ పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ తొలిరోజు ఆట ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది.
హైదరాబాద్ బౌలర్ల ధాటికి 98 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను మనన్ హింగ్రిజా (174 నాటౌట్), ఉర్విల్ పటేల్ (60) ఒడ్డున పడేశారు. త్యాగరాజన్(2/62) బౌలింగ్‌లో ఉర్విల్ ఔట్‌తో ఆరో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మనన్తో పాటు రింకేశ్ (24) క్రీజులో ఉన్నారు. సీవీ మిలింద్ (3/51), నిశాంత్ (2/46) రాణించారు.