గ్రానడా (స్పెయిన్) : ఐఎస్ఎస్ఎఫ్ రైఫిల్, పిస్టల్ వరల్డ్ కప్‌లో హైదరాబాదీ షూటర్ సురభి భరద్వాజ్ రాపోలు.. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్స్ క్వాలిఫికేషన్ రౌండ్‌కు ప్రవేశించింది.
గురువారం జరిగిన ఎలిమినేషన్ రిలేలో సురభి.. 582 పాయింట్లు స్కోరు చేసి మెయిన్ క్వాలిఫికేషన్ రౌండ్లో చోటు దక్కించుకుంది. శుక్రవారం జరిగే క్వాలిఫికేషన్ రౌండ్లో టాప్-8లో నిలిచిన షూటర్లు ప్రధాన పోటీలకు ఎంపికవుతారు.