హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్-4లో డీఎస్ఆర్ టీమ్ అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. గురువారం నాలుగో రౌండ్ ముగిసే సరికి డీఎస్ఆర్ జట్టు 659 పాయింట్లతో గ్రూపు-సీలో టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు లీగ్లో అత్యధికంగా 195 పాయింట్లతో డీఎస్ఆర్ అద్భుత ప్రదర్శనతో పుంజుకుని పోటీలోకి వచ్చింది. లీగ్లో మిగతా గ్రూపుల విషయానికొస్తే..గ్రూపు-ఎలో సామా ఎంజెల్స్(629), గ్రూపు-బిలో టీమ్ అల్ఫా(622), గ్రూపు-డీలో మీనాక్షి మావెరిక్స్(600) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.