హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పాడెల్ లీగ్ (హెచ్పీఎల్) గోపీచంద్ అకాడమీ వేదికగా శనివారం మొదలైంది. ఎనిమిది వారాల పాటు సాగే ఈ లీగ్‌లో తొలిరోజు ఆతిథ్య కివీ స్టార్స్ జట్టు మహిళల డబుల్స్ విభాగంలో హై పాంథర్స్‌పై ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. మొత్తం ఏడు జట్లు బరిలోకి దిగుతున్న ఈ లీగ్‌లో అంతర్జాతీయ ఏటీపీ, డబ్ల్యూటీఏ టెన్నిస్ స్టార్లతో పాటు బ్యాడ్మింటన్ దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమారుడు విష్ణు, పలువురు అంతర్జాతీయ అథ్లెట్లు తమ నైపుణ్యాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ పాటు రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆయా జట్ల యజమానులుగా వ్యవహరిస్తున్నారు.