హైదరాబాద్, ఆట ప్రతినిధి: నేషనల్ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా కాంస్యం గెలిచాడు. ఒడిషా వేదికగా జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన అండర్-100 కిలోమీటర్ల పోటీలో సక్సేనా మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా నితీశ్‌ను తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.
గెలుపు ఎవరిదో?
గబేహా: దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య గబేహాలో జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో లంక ఎదుట సౌతాఫ్రికా 348 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంకేయులు 52 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేశారు. ఆ జట్టు విజయానికి ఇంకా 143 పరుగుల దూరంలో ఉంది. ధనంజయ డి సిల్వ (39 నాటౌట్), కుశాల్ మెండిస్ (39 నాటౌట్) క్రీజులో ఉన్నారు.