హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) సీజన్-4లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ అదిరిపోయే బోణీ కొట్టింది. గురువారం స్థానికి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో బ్లాక్‌హాక్స్ 3-0(15-12, 18-16, 18-16)తో డిఫెండింగ్ చాంపియన్ కాలికట్ హీరోస్‌పై అద్భుత విజయం సాధించింది.
దసరా రోజున అభిమానుల అశేష మద్దతు మధ్య బ్లాక్‌హాక్స్ ప్లేయర్లు దుమ్మురేపారు. తొలి సెట్ నుంచే తమదైన దూకుడు కనబరుస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతూ పోయారు. కెప్టెన్ పౌలో లమౌనియర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. తొలి రోజు మ్యాచ్‌కు బ్లాక్‌హాక్స్ ఓనర్లు అభిషేక్‌రెడ్డి, విజయ్‌దేవరకొండ హాజరై సందడి చేశారు.