అహ్మదాబాద్: మహిళల సీనియర్ వన్డే టోర్నీలో హైదరాబాద్ అదరగొట్టింది. మంగళవారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ 14 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 48.2 ఓవర్లలో 229 పరుగులకు పరిమితమైంది.
వృశాలి భగత్(82), కుషి(52 నాటౌట్)అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. యశశ్రీ (4/49), సాక్షిరావు(4/42) నాలుగేసి వికెట్లతో ముంబై పతనంలో కీలకమయ్యారు. అంతకుముందు నిర్ణీత 50 ఓవర్లలో హైదరాబాద్ 243/6 స్కోరు చేసింది.
వికెట్‌కీపర్, బ్యాటర్ మమత(78 బంతుల్లో 86 నాటౌట్, 9ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో కదంతొక్కింది. సహచరులు అంతగా ఆకట్టుకోలేని చోట మమత సాధికారిక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. ముంబై బౌలింగ్ దాడిని సమర్థంగా తిప్పికొడుతూ తన ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు ఖాతాలో వేసుకుంది. జార్గవి పవార్(2/43), నాయక్ (2/49) రెండేసి వికెట్లు తీశారు. మమతకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.