హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్‌కు చెందిన హెల్త్‌కేర్ స్టార్టప్ బీబెటర్ వినూత్న కార్యక్రమంతో ముందుకొచ్చింది. ‘ఖేల్ బెహతర్’ కింద దేశంలోని వంద మంది అథ్లెట్లకు స్పోర్ట్స్ న్యూట్రిషన్ అందించనుంది. దేశ వ్యాప్తంగా 1700కు పైగా రిజిస్ట్రేషన్లు జరుగగా ఇందులో నుంచి వంద మందితో కుదించిన జాబితాను సిద్ధం చేశారు.
బ్యాడ్మింటన్, పవర్‌లిఫ్టింగ్, పారాలింపిక్ స్పోర్ట్స్, బాక్సింగ్, ఫుట్‌బాల్ తదితర క్రీడలకు చెందిన ప్లేయర్లకు వారి సూచనలకు అనుగుణంగా ప్రతీ నెల న్యూట్రిషన్ డైట్‌ను సమకూర్చనున్నారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, బీబెటర్ సీఈవో శ్రీకాంత్, రాజు, పృథ్వీ, అజయ్ పాల్గొన్నారు.