సోఫియా: ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల 57కిలోల విభాగంలో బరిలోకి దిగిన హుసాముద్దీన్..ల్యు పింగ్(చైనా)పై అలవోక విజయం సాధించాడు.
ఆది నుంచి తనదైన పంచ్‌లతో చెలరేగిన ఈ ఇందూరు బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పదునైన పంచ్‌లతో విరుచుకుపడి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. మరోవైపు 63కిలోల విభాగంలో శివ తాపా5-0తో ఫ్రెడ్రిక్ జెన్సన్పై గెలిచాడు.