IPL 2025 : బ్యాటింగ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలింగ్‌లోనూ దడ పుట్టిస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ టాపార్డర్‌ను పేసర్ జయదేవ్ ఉనాద్కాట్ కూల్చితే.. మిడిల్ ఆర్డర్‌ను యువ స్పిన్నర్ హర్ష్ దూబే(3-34) పడగొట్టాడు. దాంతో, 110 వద్ద 7 వికెట్ సహ.. ప్రధాన ఆటగాళ్లు డగౌట్ చేరడంతో కోల్‌కతా భారీ ఓటమికి చేరువలో ఉంది ప్రస్తుతం మనీష్ పాండే(37 నాటౌట్), హర్షిత్ రానా(19 నాటౌట్)లు ధాటిగా ఆడుతూ పరుగుల అంతరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఓవర్లకు స్కోర్ 161-7.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన భారీ ఛేదనను తడబడుతూ ఆరంభించిన కోల్‌కతా చూస్తుండగానే 7 వికెట్లు కోల్పోయింది. జయదేవ్ ఉనాద్కాట్ ధాటికి పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఇక మిడిల్ ఓవర్లలో తిప్పేసిన హర్ష్ దూబే(3-34) తొలుత డేంజరస్ ఓపెనర్ సునీల్ నరైన్(9)ను బౌల్డ్ చేసిన ఈ స్పీడ్‌స్టర్.. ఆ తర్వాత అజింక్యా రహానే(15)ను వెనక్కి పంపాడు. దాంతో, కష్టాల్లో పడిన కోల్‌కతాను ఓపెనర్ క్వింటన్ డికాక్(8), ఇంప్యాక్ట్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ(14)లు గట్టెక్కించే ప్రయత్నం చేయగా.. ఇషాన్ మలింగ ఈ జోడీని విడదీసి ప్రత్యర్థి గెలుపు అశలపై నీళ్లు చల్లాడు.
🔙 to 🔙 wickets ☝️
Harsh Dubey making his presence felt 🧡
Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR pic.twitter.com/u4SFM0mM54
— IndianPremierLeague (@IPL) May 25, 2025