అబుదాబి: వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ టీ20 ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. జాతీయ జట్టు నుంచి తప్పుకున్నా పూర్తిగా ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో విండీస్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ఇంటర్నేషనల్ లీగ్ 20 (ఐఎల్ టీ20)లో భాగంగా అబుదాబి నైట్ రైడర్స్‌కు ఆడుతున్న ఈ మిస్టరీ స్పిన్నర్.. షార్జా వారియర్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసినవారిలో అఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 681 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా డ్వేన్ బ్రావో (631) రెండో స్థానంలో ఉన్నాడు. నరైన్ మూడో స్థానానికి చేరాడు.