వంతా (ఫిన్లాండ్) : ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత వెటరన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్, తెలంగాణ ఆటగాడు మన్నేపల్లి తరుణ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 10-21, 9-21తో డేన్ అండర్స్ (డెన్మార్క్) చేతిలో, తరుణ్ 16-21, 14-21 జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో కృష్ణ ప్రసాద్- పృథ్వీ జోడీ 10-21, 21-18, 22-20తో ఐదో సీడ్ హి జి టింగ్-రెన్ జియాంగ్ (చైనా)కు షాకిచ్చి రెండో రౌండ్‌కు చేరింది.