తైపీ: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్ 21-9, 21-17తో టామీ సుగిరాటో (ఇండోనేషియా)పై విజయం సాధించాడు. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో భారత టాప్ ర్యాంకర్ వరుస గేమ్‌ల్లో విజృంభించాడు.
గత నెలలో మలేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గిన ప్రణయ్.. శుక్రవారం క్వార్టర్స్‌లో ఐదో సీడ్ అంగుస్ కా లాంగ్ (హాంకాంగ్)తో తలపడనున్నాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో పారుపల్లి కశ్యప్ 16-21, 17-21తో సు లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జోడీ 13-21, 18-21తో సియాంగ్ చెయ్-లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడింది. టాప్ సీడ్ తై జూ యింగ్ చేతిలో తాన్య కామత్ పరాజయం పాలైంది.