హైదరాబాద్, ఆట ప్రతినిధి : ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో ఆతిథ్య హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ (హెచ్బీహెచ్) మరోసారి అదరగొట్టింది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్.. 3-2 (13-15, 15-10, 18-16, 14-16, 15-11)తో బెంగళూరు టార్పెడోస్పై విజయం సాధించింది.
ఈ సీజన్లో హెచ్బీహెచ్కు ఇది ఐదో గెలుపు. తద్వారా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరి సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.