33 మందితో హాకీ కోర్ గ్రూపు

బెంగళూరు: భవిష్యత్‌లో జరిగే మేజర్ టోర్నీలను దృష్టిలో పెట్టుకుని 33 మంది ప్లేయర్లతో హాకీ ఇండియా (హెచ్ఐ) కోర్ గ్రూపును ఎంపిక చేసింది. గత కొన్ని నెలలుగా దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటుతున్న కుర్రాళ్లకు అవకాశం కల్పించింది. మొత్తం 60 మంది ప్లేయర్ల నుంచి ఎంపికైన 33 మందికి మూడు వారాల పాటు సాయ్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. వచ్చే నెలలో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్‌తో పాటు పలు టోర్నీలను లక్ష్యంగా పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ ఇవ్వనున్నారు. కోర్ గ్రూపులో సీనియర్లు శ్రీజేష్, కెప్టెన్ మన్‌ప్రీత్‌సింగ్, హర్మన్‌ప్రీత్‌సింగ్, సురేందర్ కుమార్, మణ్‌దీప్‌సింగ్, లలిత్‌కుమార్‌తో పాటు యువ ప్లేయర్లు మన్దీప్ మోర్, జుగ్రాజ్సింగ్, అభిషేక్, సుఖ్జీత్సింగ్, సంజయ్, రబిచంద్రసింగ్ ఉన్నారు. ఈ 33 మంది నుంచి అత్యుత్తమ ప్లేయర్లను తుది జట్టుకు ఎంపిక చేస్తామని చీఫ్ కోచ్ గ్రహం రీడ్ పేర్కొన్నాడు. మూడు వారాల క్యాంప్ ద్వారా ఒక్కో ఆటగాన్ని పూర్తిగా పరిశీలించి..ఎంపికలో అవకాశం కల్పిస్తామన్నాడు. మొత్తంగా జాతీయ జట్టులో యువ రక్తాన్ని నింపేందుకు హాకీ ఇండియా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plyometrics | వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ప్లయోమెట్రిక్స్ వ్యాయామం.. అంటే ఏమిటి.. ఏం చేయాలి..?
Chaminda Vaas: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా చామిండ వాస్
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

