హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికలకు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియపై రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి జీపీ పాల్గుణ దాఖలు చేసిన పిటీషన్‌ను గురువారం హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 19వ తేదీని విడుదలైన టీవోఏ ఎన్నికల ఎలక్టోరల్ జాబితాలో ఫుట్‌బాల్ సంఘాన్ని తీసివేయడాన్ని సవాలు చేస్తూ పాల్గుణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిల్‌ను స్వీకరించిన న్యాయస్థానం..ఎన్నికల ప్రక్రియ స్టేటస్కో విధించింది.