Lionel Messi : ‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ఢిల్లీలో అడుగుపెట్టాడు లియోనల్ మెస్సీ(Lionel Messi). మూడురోజుల పర్యటనలో చివరిదైన దేశ రాజధానిలో ఫుట్‌బాల్ దిగ్గజం తన బృందంతో కలిసి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అర్జెంటీనా లెజెండ్ మెస్సీ రాకతో ఢిల్లీవాసులు ఓవైపు ఖుషీ అవుతూనే.. గాలి కాలుష్యంతో అతడి ఆరోగ్యం చెడుతుందని మరికొందరు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. మెస్సీ ఢిల్లీకి వచ్చేశావు. మరి.. నీ ఊపిరితిత్తులకు బీమా ఉందా? అని సరదాగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్ట్‌లు వైరలవుతున్నాయి.
అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ.. సోమవారం ఢిల్లీని ఊర్రూతలుగించనున్నాడు. కోల్‌కతాలో ఉద్రిక్తతలు మినహా.. హైదరాబాద్, ముంబైలో సాకర్ మాంత్రికుడి పర్యటన విజయవంతమైంది. ఢిల్లీలో సైతం ఫుట్‌బాల్ లెజెండ్‌కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు.. నగరంలో గాలి నాణ్యత (Air Quality Index) 500లకు పడిపోవడాన్ని ప్రస్తావిస్తూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఢిల్లీలోకి స్వాగతం మెస్సీ. నీ ఎడమ కాలికి 900 అమెరికా డాలర్లతో బీమా చేయించావని తెలిసింది. మరి.. నీ ఊపిరితిత్తులకు బీమా ఉందా?’ అని నెట్టింట వెలిసిన పోస్ట్ నవ్వు తెప్పిస్తోంది.
Messi aapka delhi main swagat hai
I heard your left leg is insured for $900 million, lungs ka kya? pic.twitter.com/c2AZDMNsO9— Teri nani ka boytoy (@bklghaziabadi) December 15, 2025
ఢిల్లీలో సోమవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. పొగమంచు కమ్మేయడంతో రైళ్ల, విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. కాలుష్య తీవ్రత పెరిగిన వేళ మెస్సీ.. ఢిల్లీకి రావడాన్ని స్వాగతిస్తూనే నీ ఆరోగ్యం జాగ్రత్త అని కామెంట్ చేస్తున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియంలోక్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులను కలువనున్నాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఇండియా టూర్ ముగియనుంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని సాకర్ లెజెండ్ స్వదేశం వెళ్లిపోనున్నాడు.
Lionel Messi has the most expensive insurance among all the football players. His left foot alone is insured for $900 Million‼️😳 pic.twitter.com/uASvodlRYA
— Daily Loud (@DailyLoud) December 31, 2022