IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ ఫైనల్ పోరుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు భారీ షాక్. చెన్నై(Chennai)లో భారీ వర్షం పడింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో, మెరుపులతో చినుకులు మొదలయ్యాయి. ఊహించని వర్షం రాకతో అప్రమత్తమైన చెపాక్ స్టేడియం (Chepauk Stadium) సిబ్బంది ప్లాస్టిక్ కవర్లతో పిచ్ మొత్తాన్ని కప్పి వేశారు.
వాన ఎంతకూ తగ్గకపోవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకున్నారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు వాన ముప్పు తప్పకపోవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), కోల్‌కతా ఫైనల్ ఫైట్ మే 26 ఆదివారం చెపాక్‌లో జరుగనుంది. సండేనాడు వాన పడేందుకు 3 శాతం చాన్స్ ఉందట. అంతేకాదు ఆ రోజంతా 97 శాతం వరకు మేఘాలు కమ్మి ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఒకవేళ వాన కారణంగా ఆదివారం ఆట సాధ్యం కాకుంటే రిజర్వ్ డే(Reserve Day) ఎలాగూ ఉండనే ఉంది. 26న కొన్ని ఓవర్ల తర్వాత చినుకులు పడితే.. యథావిధిగా మరునాడు మ్యాచ్ ఆడిస్తారు. స్పిన్నర్లకు స్వర్గధామమైన చెపాక్ స్టేడియంలో కోల్‌కతా మూడో టైటిల్ అందుకుంటుందా? లేదా ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో రెండో ట్రోఫీ చేరుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Two Captains. One Trophy 🏆
..And an eventful Chennai evening 🛺🏖️
All eyes on the #Final 😎#TATAIPL | #KKRvSRH | #TheFinalCall pic.twitter.com/5i0nfuWTGN
— IndianPremierLeague (@IPL) May 25, 2024