INDW vs AUSW : మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టుకు మరోషాక్. విశాఖపట్టణంలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన పోరులో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ల మెరుపులతో టీమిండియా భారీ స్కోర్ చేసినా.. ఎలీసా హెలీ(142) సెంచరీతో చెలరేగి లక్ష్యాన్ని కరిగించింది. ఆమెకు ఎలీసా పెర్రీ(47 నాటౌట్), గార్డ్నర్ (45)లు తోడవవ్గా ఆస్ట్రేలియా వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనతో ఆసీస్ జట్టు రికార్డు నెలకొల్పింది. స్నేహ్ రానా ఓవర్లలో పెర్రీ సిక్సర్‌తో కంగారూ టీమ్‌కు చిరస్మరణీయ విక్టరీని అందించింది.
సొంతగడ్డపై జరుగుతన్న వరల్డ్ కప్‌లో టీమిండియాకు మరో భంగపాటు. దక్షిణాఫ్రికా చేతిలో చేజారిన ఓటమిని మరువక ముందే ఆస్ట్రేలియా దెబ్బకు మరో పరాజయం ఎదురైంది. వన్డేల్లో భారీ ఛేదనకు దిగిన ఆసీస్‌కు కెప్టెన్ ఎలీసా హేలీ (142) శతకంతో గట్టి పునాది వేసింది. పవర్ ప్లే తర్వాత డేంజరస్ ఓపెనర్ ఫొబె లిచ్‌ఫీల్డ్ (40)ను ఔట్ చేసిన శ్రీచరణి ఈసారి అనాబెల్ సథర్‌లాండ్‌ను క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో.. వరుస ఓవర్లలో రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు దీప్తి శర్మ ఓవర్లో మిడాన్ దిశగా షాట్ ఆడిన బేత్ మూనీ(4)ని డైవింగ్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది జెమీమా. బంతిని గమనించిన జెమీమా ఎడమవైపు డైవ్ చేస్తూ రెండుచేతుల్తో క్యాచ్ అందుకుంది. దాంతో, 68 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే శ్రీచరణి వికెట్ తీయడంతో ఆసీస్ ఒత్తిడిలో పడింది.
Just Australia things 🔥 pic.twitter.com/t0heMFwGNF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 12, 2025
వికెట్లు పడుతున్నా హేలీ మాత్రం జోరు తగ్గించలేదు. సెంచరీ తర్వాత మరింత దంచేసిన ఆమె 38వ ఓవర్ ఐదో బంతికి కవర్స్‌లో షాట్ ఆడింది. అక్కడే కాచుకొని ఉన్న స్నేహ్ రానా ముందుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో ఒడుపుగా క్యాచ్ అందుకుంది. రీప్లేలోనూ ఫేర్ క్యాచ్ అని తేలడంతో ఆసీస్ కెప్టెన్ నిరాశగా పెవిలియను చేరింది. కీలక వికెట్ తీసిన చరణి.. 96 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యాన్ని ముగించింది. 39 ఓవర్లకు కంగారూ టీమ్ స్కోర్ 265-4. ఇంకా విజయానికి 65 రన్స్ కావాలంతే. తహ్లియా మెక్‌గ్రాత్‌ను దీప్తి ఎల్బీగా ఔట్ చేయగా టీమిండియా రేసులోకి వచ్చింది. గార్డ్నర్ను అమన్‌జోత్ బౌల్డ్ చేయగా ఆరో వికెట్ పడడంతో సమీకరణం 30 బంతుల్లో 35కు చేరింది. కానీ, ఎలీసా పెర్రీ(47 నాటౌట్).. కిమ్ గార్త్ (14)లు క్రాంతి వేసిన 47వ ఓవర్లో చెరొక ఫోర్ బాదారు. పెర్రీ సిక్సర్‌తో జట్టుకు మూడు వికెట్ల విజయాన్ని అందించింది. దాంతో.. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.
Australia win the match by 3 wickets.#TeamIndia fought spiritedly and will look to bounce back in the next match.
Scorecard ▶ https://t.co/VP5FlL2S6Y#WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/dc473c4dDW
— BCCI Women (@BCCIWomen) October 12, 2025
మహిళల వన్డే వరల్డ్ కప్‌లో తొలి ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (80), ప్రతీకా రావల్ (75) దంచికొట్టడంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి వికెట్‌కు వీరిద్దరూ 155 రన్స్ జోడించి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ (33), రీచా ఘోష్ (32)లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో స్కోర్ 300 దాటించారు. అప్పటికి చేతిలో ఆరు వికెట్లు ఉండడంతో స్కోర్ 350 దాటడం ఖాయమనిపించింది. కానీ, టెయిలెండర్లు అనవసర షాట్లకు యత్నించి చకచకా పెవిలియన్ చేరారు. 49వ ఓవర్లో క్రాంతి గౌడ్ వికెట్ తీసిన సథర్లాండ్ ఆ తర్వాతి బంతికే శ్రీచరణిని క్లీన్ బౌల్డ్ చేయడంతో 330 వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది.
Putting up a sensational performance at the 🔝 of the order 🫡
Smriti Mandhana 🤝 Pratika Rawal
Scorecard ▶ https://t.co/VP5FlL2S6Y#WomenInBlue | #CWC25 | #INDvAUS | @mandhana_smriti pic.twitter.com/QEPaNc7q8A
— BCCI Women (@BCCIWomen) October 12, 2025