BANW vs AUSW : మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. భారత జట్టుపై సూపర్ సెంచరీతో జట్టును గెలిపించిన అలీసా హీలీ (113 నాటౌట్) బంగ్లాదేశ్‌పైనా దంచేసింది. హీలీ వరుసగా శతకంతో చెలరేగగా.. యువకెరటం ఫొబో లిచ్‌ఫీల్డ్ (84 నాటౌట్) అర్ధ శతకంతో విరుచుకుపడింది. దాంతో, బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్య్నా సంగం ఓవర్లోనే ఆసీస్ ఉఫ్‌మనిపించింది. హీలీ, లిచ్‌ఫీల్డ్‌లు ఈ టోర్నీలోనే తొలి వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పగా.. పది వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది. వరుసగా నాలుగో ఓటమితో సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
వరల్డ్ కప్‌లో తమ అధిపత్యాన్ని చాటుతూ ఆస్ట్రేలియా మరో భారీ విజయం అందుకుంది. తొమ్మిదో టైటిల్ వేటలో దూకుడు కనబరుస్తున్న ఆసీస్ గురువారం బంగ్లాదేశ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. కెప్టెన్ అలీసా హీలీ (117 నాటౌట్) శతకగర్జనకు. ఫొబే లిచ్‌ఫీల్డ్(84 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్ తోడవ్వగా పది వికెట్లతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఛేదనలో రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు.. ఆ తర్వాత తమ స్టయిల్లో ఎదురు దాడికి దిగారు.
New day, same old Australia 🤌 pic.twitter.com/dH6sR9RVXv
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025
క్రీజులో చురుకుగా కదులుతూ.. ఫ్రంట్‌ఫుట్‌లో ఆడుతూ బౌండరీలు రాబట్టింది లిచ్‌ఫీల్డ్. దాంతో, పవర్ ప్లేలోనే 78 రన్స్ పిండుకున్న ఈ ద్వయం ఆ తర్వాత మరింత రెచ్చిపోయింది. అయితే.. షోర్నా అక్తర్ వేసిన 20వ ఓవర్లో 67 పరుగుల వద్ద స్వీప్‌షాట్ ఆడిన హీలీ ఔటయ్యేదే. కానీ, ఫీల్డర్ క్యాచ్ వదిలేయడంతో 67 పరుగుల వద్ద బతికిపోయిన ఆమె ఆ తర్వాత గేర్ మార్చింది. ఆదే ఓవర్లో రెండు ఫోర్లు బాదిన తను.. ఆ తర్వాత రితూ మినీని ఉతికేస్తూ రెండో బౌండరీలతో సంచరీకి చేరువైంది. శతకం తర్వాత కూడా దూకుడు తగ్గించని హీలీ 24వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా.. తర్వాత రెండు ఫోర్లతో జట్టుకు 10 వికెట్ల విజయాన్ని కట్టబెట్టింది లిచ్‌ఫీల్డ్.
Back-to-back 💯s at #CWC25 for Australia skipper Alyssa Healy 🫡
Watch #AUSvBAN LIVE in your region, broadcast details here ➡️ https://t.co/QNFzetG4yS pic.twitter.com/8T2zhKWXsn
— ICC Cricket World Cup (@cricketworldcup) October 16, 2025
వరల్డ్ కప్‌లో రెండో విజయం కోసం శ్రమిస్తున్న బంగ్లాదేశ్ స్వల్క స్కోర్‌కే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని ఓపెనర్ రుబియా హైదర్(44) శుభారంభమిచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో చూస్తుండగానే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో శోభన మోస్త్రే(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఓవైపు వికెట్లు పడుతున్నా వెరవకుండా క్రీజులో నిలిచిన తను డాన్సీ బ్రౌన్ వేసిన 40వ ఓవర్లో మూడు బౌండరీలతో జట్టు స్కోర్ 150 దాటించింది. అజేయంగా నిలిచిన మేస్త్రీ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అదించింది. దాంతో, ఈ వరల్డ్ కప్‌లో మొదటిసారిగా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోయింది ఆసీస్.
Australia need 199 runs to go to the top of the table 🔝#AUSvBAN scorecard: https://t.co/6WKrQ2eWrv pic.twitter.com/O5wgi2uJTE
— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025