IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓపెనర్ ట్రావిస్ హెడ్(55 నాటౌట్ : 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచేస్తున్నాడు. గత మ్యాచ్‌లో విఫలమైన హెడ్.. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లను ఉతికేస్తూ అర్ధ శతకం సాధించాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో, 8 ఓవర్లకు ఆరెంజ్ ఆర్మీ వికెట్ నష్టానికి 109 రన్స్ చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(32), ట్రావిస్ హెడ్(55 నాటౌట్)లు ఎప్పటిలానే శుభారంభం ఇచ్చారు. కోల్‌కతా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, పవర్ ప్లేలోనే స్కోర్ చేరింది. దంచికొడుతున్న ఈ జోడీని సునీల్ నరైన్ విడదీశాడు. పెద్ద షాట్‌కు యత్నించిన అభిషేక్ .. బౌండరీ లైన్ వద్ద రింకూకు దొరికాడు. దాంతో, 92 వద్ద తొలి వికెట్ పడింది. కాసేపటికే హెడ్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ఎడిషన్‌లో హెడ్‌కు ఇది మూడో యాభై.
𝗧𝗿𝗮𝘃𝗶𝘀 𝗛𝗲𝗮𝗱𝗹𝗶𝗻𝗲𝘀 #SRH‘s start 🧡
3⃣rd fifty of the season as he continues to go strong 💪
Updates ▶ https://t.co/4Veibn1bOs #TATAIPL | #SRHvKKR pic.twitter.com/vE0qm3gNww
— IndianPremierLeague (@IPL) May 25, 2025