న్యూఢిల్లీ, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) వ్యవహారాలపై జస్టిస్ లావు నాగేశ్వర్రావు సమర్పించిన నివేదికపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ఏకసభ్య కమిటీ నివేదికపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ప్రత్యేక ధర్మాసనం గురువారం జరుపాల్సిన విచారణ కొనసాగలేదు. హెచ్‌సీఏలో 57 క్రికెట్ క్లబ్‌లలో కొంత మంది కుటుంబ సభ్యుల ఆధిపత్యానికి చెక్ పెడుతూ జస్టిస్ నాగేశ్వర్రావు సుప్రీం కోర్టుకు ఇది వరకే నివేదిక సమర్పించారు. తమ క్లబ్‌లపై నిషేధాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై గత కొన్ని నెలలుగా విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే.