IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్‌కు వేళైంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న పోరులో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ సారథి రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ స్కోర్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు జోష్ హేజిల్‌వుడ్ పెద్ద షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(4) వికెట్ సాధించాడు.
రెండో బంతినే బౌండరీకి పంపిన డికాక్ ప్రమాదకరంగా కనిపించాడు. అయితే.. హేజిల్‌వుడ్ ఊరించే బంతితో అతడిని కీపర్ జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చేలా చేశాడు. దాంతో, కోల్‌కతా 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ అజింక్యా రహానే(0), సునీల్ నరైన్(5)లు ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్లకు కేకేఆర్ స్కోర్.. 9/1.
కోల్‌కతా జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకూ సింగ్, అంగ్కృష్ రఘువంశీ, సునీల్ నరైన్, అండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
ఆర్సీబీ జట్టు : విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ దార్ సలాం, సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.