Asia cup 2023 : ఆసియా కప్‌లో ఆతిథ్య శ్రీలంక(Srilanka) తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ దిముత్ కరుణరత్నే(18) ఔటయ్యాడు. హసన్ మహమూద్(Hasan Mahmud) బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండరీలు కొట్టిన కరుణరత్నే మూడో బంతికి షాట్ ఆడబోయాడు. కానీ, వికెట్ కీపర్ ముష్పికర్ రహీం చేతికి చిక్కాడు. దాంతో, 34 పరుగుల వద్ద లంక తొలి వికెట్ పడింది. ప్రస్తుతం కుశాల్ మెండిస్(5), ఓపెనర్ పథుమ్ నిస్సంక(12) ఆడుతున్నారు. 6 ఓవర్లకు శ్రీలంక స్కోర్.. 35-1
కీలకమైన సూపర్ 4 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, లంక మొదట బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఐదు ఓవర్లలో ఓపెనర్లు కరుణరత్నే, నిస్సంక ధాటిగా ఆడారు. అయితే.. మహమూద్ తొలి వికెట్ తీసి బంగ్లాకు బ్రేక్ ఇచ్చాడు. పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం.