IPL 2025 : పంజాబ్ కింగ్స్ గడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభిస్తున్నారు. పేసర్ హర్షిత్ రానా(3-18) తన మొదటి ఓవర్లో రెండు వికెట్లు తీసి పంజాబ్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడీ స్పీడ్‌స్టర్. దాంతో, 3 ఓవర్లకే 33 రన్స్ చేసిన ఆ జట్టు జోరుకు బ్రేక్ పడింది. అదే ఓవర్లో శ్రేయస్ అయ్యర్‌ను 6 పరుగుల వ్యవధిలోనే పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది.
That’s a STUNNER 😮
🎥 Ramandeep Singh pulls off a splendid grab to help Harshit Rana get 2⃣ in the over!#PBKS are 42/3 after 5 overs.#TATAIPL | #PBKSvKKR | @KKRiders pic.twitter.com/yBRPjJzdle
— IndianPremierLeague (@IPL) April 15, 2025
ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(30) జోరు తగ్గించడం లేదు. హర్షిత్‌ను ఉతికేస్తూ రెండు సిక్సర్లు బాదేశాడు. దాంతో, పంజాబ్ స్కోర్ 50 దాటింది. అయితే.. ఆ తర్వాత బంతికే గల్లీలో కాచుకొని ఉన్న రమన్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు ప్రభ్‌సిమ్రన్. ప్రసతుతం గ్లెన్ మ్యాక్స్‌వెల్(0), నేహల్ వధేరా(0) క్రీజులో ఉన్నారు. పవర్ ప్లేలో పంజాబ్ స్కోర్.. 54-4.
టాస్ గెలిచిన పంజాబ్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి ఓవర్లో వైభవ్ ఆరోరా 4 రన్స్ ఇవ్వగా.. ఆ తర్వాత అన్రిచ్ నోర్జి ఓవర్లో.. ప్రియాన్స్ ఆర్య(22) రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత వైభవ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్(30) వరుసగా 4, 6, 4 బాదగా.. ఐదో బంతిని ప్రియాన్ష్ లాంగాఫ్‌లో బౌండరీకి తరలించాడు. దాంతో పంజాబ్ స్కోర్ 30 దాటింది. ఆ తర్వాత హర్షిత్ రెండు బంతుల వ్యవధిలో ప్రియాన్స్, శ్రేయస్ అయ్యర్‌లను పెవిలియన్ పంపాడు. వీళ్లిద్దరి క్యాచ్‌లను రమన్‌దీప్ సింగ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఆదుకుంటాడనుకున్న జోష్ ఇంగ్లిస్(2)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేసి మూడో వికెట్ అందించాడు.అంతే.. పంజాబ్ కష్టాల్లో పడింది.