న్యూఢిల్లీ : డిసెంబర్ 15-22 తేదీల్లో స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగే అయిదు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ సారధ్యం వహించనున్నాడు. సుమిత్, రోహిదాస్ వైస్‌కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. 2023-24 హాకీ ప్రొ లీగ్ సీజన్‌కు ఈ టోర్నీ సన్నాహకంగా ఉపయోగపడనున్నది.
ఇండియాతోపాటు స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఈ టోర్నీకోసం 24 మంది సభ్యుల జట్టును గురువారం ప్రకటించారు.