లాసానే(స్విట్జర్లాండ్): ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్(ఎఫ్ఐహెచ్) అవార్డు రేసులో భారత కెప్టెన్ హర్మన్ప్రీత్సింగ్తో పాటు మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ పోటీపడుతున్నారు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ కాంస్య పతకం గెలువడంలో హర్మన్‌ప్రీత్‌తో పాటు శ్రీజేశ్ కీలకంగా వ్యహరించారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ ఏకంగా 10 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎఫ్ఐహెచ్ మంగళవారం అవార్డుల కుదింపు జాబితాను విడుదల చేసింది. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసు కోసం థియరీ బ్రింక్‌మన్, జోప్ డీ మోల్(నెదర్లాండ్స్), హన్నెస్ ముల్లర్(జర్మనీ), జాచ్ వాలెస్(ఇంగ్లండ్)తో హర్మన్‌ప్రీత్ పోటీలో ఉన్నాడు. మరోవైపు గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియాగా పేరొందిన శ్రీజేశ్..గోల్‌కీపర్ అవార్డు కోసం రేసులో ఉన్నాడు. 2024లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటూ చేపట్టనున్న ఓటింగ్ ప్రక్రియ అక్టోబర్ 11 వరకు కొనసాగనుంది.