Smriti Mandhana | ముంబై: ఈనెల 10 నుంచి స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత మహిళల క్రికెట్ జట్టును స్మృతి మంధాన నడిపించనుంది. రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో మంధాన సారథ్యాన భారత్ బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్‌తో పాటు పేసర్ రేణుకాసింగ్ ఠాకూర్‌కు సైతం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారి స్థానాల్లో రఘ్వి, సయాలి జట్టులోకి వచ్చారు. జనవరి 10, 12, 15న ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా భారత్ మూడు వన్డేలు ఆడనుంది. కాగా ఇటీవల విండీస్ సిరీస్‌కు దూరమైన షషాలీ వర్మను సెలక్టర్లు తాజా సిరీస్‌లోనూ పక్కనబెట్టారు.