ICC Rankings | టాప్ -10కు దూసుకెళ్లిన భారత కెప్టెన్.. దీప్తి శర్మకు మూడో స్థానం
ICC Rankings : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings )లోనూ సత్తా చాటింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -10లోకి దూసుకెళ్లింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్ తిరిగి టాప్-10లో చోటు దక్కించుకుంది. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana, 728 పాయింట్లు)...
ICC Rankings : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings )లోనూ సత్తా చాటింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ -10లోకి దూసుకెళ్లింది. ఐసీసీ మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో హర్మన్ తిరిగి టాప్-10లో చోటు దక్కించుకుంది. బంగ్లాదేశ్‌పై తొలి టీ20లో అజేయ హాఫ్ సెంచరీ(54)తో హర్మన్‌ప్రీత్ జట్టును గెలిపించింది. ఆ ప్రదర్శనతో ఆమె నాలుగు స్థానాలు మెరుగు పర్చుకొని 10వ ర్యాంక్‌కు దూసుకెళ్లింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ తహ్లియా మెక్‌గ్రాత్(Tahlia Mcgrath) 784 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బెత్ మూనీ (Beth Mooney, 777 పాయింట్లు), భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana, 728 పాయింట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారు.
స్మృతి మంధాన, దీప్తి శర్మ

దీప్తికి మూడో ర్యాంక్
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) అదరగొట్టింది. 733 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సోఫియా ఎకెల్‌స్టోన్ (Sophie Ecclestone, 788 పాయింట్లు) అగ్రస్థానం సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్‌పై రెండో టీ20లో బంతితో విజృంభించిన దీప్తి వచ్చే వారానికల్లా ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బంగ్లాతో మంగళవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో దీప్తి మూడు వికెట్లు పడగొట్టింది. సంచలన ప్రదర్శన చేసిన ఆమె ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
INDW vs BANW | ఉత్కంఠ పోరులో బంగ్లా చిత్తు.. టీ 20 సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు
MS Dhoni | కూల్ కెప్టెన్ ఫామ్ హౌస్‌లో అరుదైన జంతువులు.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

