MS Dhoni | కూల్ కెప్టెన్ ఫామ్ హౌస్‌లో అరుదైన జంతువులు.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..!
MS Dhoni : భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni). జూలపాల జట్టుతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్(Jharkhand Dynamite) అనతి కాలంలోనే దిగ్గజాల సరసన నిలిచాడు. ఇన్నాళ్లు ధోనీకి బైక్‌లంటే బాగా మోజు అనుకున్నాం.. ఇప్పుడు ఈ జాబితాలో మరికొన్ని చేరాయి. జంతువులను అమితంగా ప్రేమించే మహీ.. రాంచీలోని తన ఫామ్‌హౌజ్(Ranchi Farm House)లో...
MS Dhoni : భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni). జూలపాల జట్టుతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్(Jharkhand Dynamite) అనతి కాలంలోనే దిగ్గజాల సరసన నిలిచాడు. ఇన్నాళ్లు ధోనీకి బైక్‌లంటే బాగా మోజు అనుకున్నాం.. ఇప్పుడు ఈ జాబితాలో మరికొన్ని చేరాయి. జంతువులను అమితంగా ప్రేమించే మహీ.. రాంచీలోని తన ఫామ్‌హౌస్(Ranchi Farm House)లో ప్రత్యేకంగా కొన్ని అరుదైన జాతులను పెంచుకుంటున్నాడు. అందులో ఏమేం ఉన్నాయంటే..?
ఇటీవలే తన 42వ పుట్టిన రోజును పెంపుడు కుక్కల మధ్య జరుపుకున్న తలా.. వాటికి కేక్ తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. మహీకి ఎంతో ఇష్టమైన ఆ కుక్కల ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.
పెట్స్ సమక్షంలో కేకు కోసిన ధోనీ

వేర్వేరు జాతులకు చెందిన ఆ శునకాల విలువ మార్కెట్లో రూ. 5 లక్షలకు పైనే ఉంటుంది. అందులోని డచ్ షెఫర్డ్(Dutch Shepherd) జాతికి చెందిన కుక్క ధర మనదేశంలో లక్ష నుంచి లక్షన్నర మధ్య ఉంటుందని అంచనా.
పాపులర్ బ్రీడ్ గుర్రం
ప్రపంచంలో అరుదైన జాతిగా చెప్పుకునే షెట్‌ల్యాండ్ పోనీ గుర్రం(Shetland Pony Horse) కూడా ధోనీ ఫామ్ హౌస్‌లో ఉంది. దీని విలువ అక్షరాల లక్షా 30 వేలు. మంచి సామర్థ్యం కల్గిన, పాపులర్ బ్రీడ్‌లలో ఇదొకటి. ఈ గుర్రమంటే ధోనీ కూతురు జివా(Ziva)కు బాగా ఇష్టమట.
పెంపుడుకుక్కలతో ధోనీ, అతడి భార్య సాక్షి

దీనికి తోడు చేతక్(Chetak) అనే నల్ల గుర్రం కూడా ఉంది. చేతన్‌కు సంబంధించిన వీడియోలను ధోనీ భార్య సాక్షి(Sakshi) పలుమార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. ఈ మాజీ కెప్టెన్ ధోనీ బైక్‌లపైనే కాదు జంతువుల మీద అమితమైన ప్రేమ కనబరుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మైదానంలో ప్రశాంతంగా కనిపిస్తూ తన వ్యూహాలను అమలు పరిచే ధోనీ అంతర్జాతీయ క్రికెట్(International Cricket)కు వీడ్కోలు పలికినా.. ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. తన మార్క్ కెప్టెన్సీతో ధోసీ పదహారో సీజన్లో చెన్నైను ఐపీఎల్ విజేతగా నిలిపాడు.
ఇవి కూడా చదవండి
Saeed Ajmal | ఆరోజు నాకు రావాల్సిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ధోనీకి ఇచ్చారు.. పాక్ బౌలర్ అక్కసు
Virat Kohli | మైదానంలో చిరుతను తలపించే కోహ్లీ ఫిట్నెస్ మంత్ర ఇదే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

