World Cup Toss : ప్రపంచకప్‌లో కెప్టెన్సీతో అదరగొడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకూ ఒకేఒకసారి టాస్ గెలుపొందిన కౌర్‌కు ఫైనల్లోనూ నిరాశే మిగిలింది. భారత జట్టుకు టాస్ అచ్చిరాలేదు. లీగ్ దశల ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ ఫైనల్లోనూ టాస్ ఓడిపోయింది. దాంతో.. ఈ మెగా టోర్నీలో తను ఎనిమిదోసారి టాస్ గెలవలేదు. తద్వారా 43 రికార్డును హర్మన్‌ప్రీత్ సమం చేసింది.
వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక టాస్‌లు ఓడిపోయిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1982 ఎడిషన్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ రాచెల్ హెహో ఫ్లింట్ (Rachael Heyhoe Flint) 13 మ్యాచుల్లో 9 పర్యాయాలు టాస్ ఓడింది. అదే ఏడాది న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ షరోన్ ట్రెడ్రీ 12 మ్యాచుల్లో 8 సార్లు టాస్ ఓడింది. 2000 వరల్డ్ కప్‌లో శ్రీలంక ఏడుకు డు మ్యాచుల్లో టాస్ గెలవలేదు. పదమూడో సీజన్లో దక్షిణాఫ్రికాను ఫైనల్ చేర్చిన లారా వొల్వార్డ్త్ సైతం 9 మ్యాచుల్లో ఏడు సార్లు విఫలమైంది.
Team’s losing most tosses in Women’s WC edition.
9 out of 13 – ENG-W in 1982
8 out of 9 – IND-W in 2025
8 out of 12 – IND-W in 1982
7 out of 7 – SL-W in 2000
7 out of 9 – SA-W in 2025 pic.twitter.com/9dfuRwXlrh— The sports (@the_sports_x) November 2, 2025