హర్లీన్ డియోల్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్

కార్డిఫ్ : ఇంగ్లండ్‌తో జరిగిన మహిళల తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 18 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో హర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని తెగ అట్రాక్ట్ చేసింది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద హర్లీన్ క్యాచ్ అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలెట్. నిజానికి ఇండియన్ ప్లేయర్ హర్లీన్ ఆ క్యాచ్ పట్టుకునేందుకు ఎంతో సమయస్పూర్తిని ప్రదర్శించింది. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్లీన్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ ఎల్లన్ జోన్స్ కొట్టిన షాట్‌ను గాలిలోకి ఎగిరి అందుకున్నది. కానీ బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్ దాటుతున్నట్లు గమనించిన హర్లీన్ తన చేతిలో ఉన్న బంతిని మైదానంలోకి విసిరింది. మళ్లీ బౌండరీ రోప్ దాటి వచ్చి.. డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకుని అందర్నీ స్టన్ చేసింది.
A fantastic piece of fielding 👏
— England Cricket (@englandcricket) July 9, 2021
We finish our innings on 177/7
Scorecard & Videos: https://t.co/oG3JwmemFp#ENGvIND pic.twitter.com/62hFjTsULJ
ఈ అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేసింది. ఆ వీడియోపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ కామెంట్ పోస్టు చేశారు. క్రికెట్ ఫీల్డ్‌లో ఇలాంటి క్యాచ్‌లు అరుదు అని, ఇదో టాప్ క్లాస్ క్యాచ్ అని లక్ష్మణ్ ప్రశంసించాడు. తొలుత ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 177 రన్స్ చేసింది. ఇక చేజింగ్‌కు దిగిన ఇండియా 8.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన 54 రన్స్ చేసిన సమయంలో వర్షం ఆటను అడ్డుకున్నది. డీఎల్ఎస్ పద్ధతిలో ఇంగ్లండ్ 18 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆదివారం రోజున రెండవ టీ20 మ్యాచ్ హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్లో జరగనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

