Hardik Pandya | డేటింగ్ రూమర్స్.. గర్ల్‌ఫ్రెండ్‌తో తొలిసారి కెమెరాకు చిక్కిన హార్దిక్ పాండ్యా.. VIDEO
Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే.
Hardik Pandya | స్టార్ క్రికెటర్, టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. భార్య నటాషాతో విడాకుల అనంతరం హార్దిక్ మళ్లీ డేటింగ్లో ఉన్నారంటూ కొంతకాలంగా తెగ ప్రచారం జరుగుతోంది. మోడల్, నటి మహియెకా శర్మ (Mahieka Sharma)తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాండ్యా మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ (rumoured girlfriend) మహియెకాతో పాండ్యా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. తాజాగా వీరిద్దరూ ముంబై ఎయిర్పోర్ట్ (Mumbai airport)లో కెమెరాకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక విడాకుల అనంతరం మహియెకాతో హార్దిక్ పాండ్యా కనిపించడం ఇదే తొలిసారి. దీంతో డేటింగ్ వార్తలు నిజమే అంటూ నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
నటాషాతో విడాకులు ప్రకటించిన అనంతరం పాండ్య బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియాతో కొన్నిరోజులు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది కూడా కొన్నిరోజులకే బ్రేకప్ అవ్వగా.. తాజాగా మహియెకా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వైరలవుతున్నాయి. మొదటగా ఈ పుకార్లు రెడిట్ అనే సోషల్ మీడియా ద్వారా ప్రారంభం అయ్యాయి. ఇందులో ఒక పోస్ట్‌లో మహియెకా షేర్ చేసిన ఒక సెల్ఫీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక వ్యక్తి బ్లర్‌గా కనిపించాడు. అయితే అతడు హార్దిక్ పాండ్యానే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాకుండా మహియెకా పోస్ట్‌లలో ఎక్కడో హార్దిక్ జెర్సీ నంబర్ 33 కనిపించడాన్ని కూడా ఒక యూజర్ గుర్తించారు. మరోవైపు ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. హార్దిక్, మహియెకా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవుతున్నారని అభిమానులు గమనించారు. కొన్ని ఫోటోలలో ఇద్దరూ ఒకే రకమైన బాత్రోబ్ ధరించినట్లు కూడా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెటిజన్లు సోషల్ మీడియాలో బయటపెట్టారు. ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్‌లో ఉన్న సమయంలో మహియెకా కూడా అక్కడికి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు తొలిసారి ఇద్దరూ జంటగా కనిపించడం ఆ రూమర్స్‌కు బలం చేకూర్చింది.
Also Read..
Zubeen Garg | జుబీన్ గార్గ్ మృతి కేసు.. ఇద్దరు వ్యక్తిగత భద్రతా సిబ్బంది అరెస్ట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

