Seat Belt Controversy | ఇంగ్లండ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటిరోజు ముంబైలో సందడి చేసిన కీర్ స్టార్మర్ అనంతరం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ భేటి అనంతరం వీరిద్దరూ కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి వివాదాస్పదంగా మారింది. ఇందులో బ్రిటన్ ప్రధాని కీర్ సీట్ బెల్ట్ ధరించి ఉండగా.. నరేంద్ర మోదీ మాత్రం సీట్ బెల్ట్ ధరించకుండా ఫొటోలకు ఫోజులిచ్చాడు. అయితే ఈ విషయంపై నెటిజన్లు మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోరుగుదేశం ప్రధాని మన దేశంకి వచ్చి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తుంటే మన దేశ ప్రధాని మాత్రం రూల్స్ పాటించకుండా ఫొటోలకు ఫోజులిస్తాన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు రోడ్డు భద్రతా నిబంధనలను దేశ ప్రధానియే పాటించకపోతే సాధారణ పౌరులు ఎలా పాటిస్తారంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
మరోవైపు భారత పర్యటనలో ఉన్న యూకే ప్రధాని.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రశంసించారు. భారత్ ఇటీవలే జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా (Indian Economy) అవతరించిందని గుర్తు చేశారు. 2028 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తోందంటూ ప్రశంసలు కురిపించారు.
PM Narendra Modi tweets, “India-UK friendship is on the move and is filled with great vigour! A picture from earlier today, when my friend PM Starmer and I began our journey to attend the Global Fintech Fest.” pic.twitter.com/X51wMHQLiH
— ANI (@ANI) October 9, 2025
The British PM is wearing a seat belt.
Safety first. https://t.co/DIXptVb1AH— Man Aman Singh Chhina (@manaman_chhina) October 9, 2025
Mr. Starmer is wearing seatbelt as it should be. Mr. Modi isn’t.
We Indians always take safety lightly. Everybody thinks “Humko kuch nahi ho sakta”. It’s our DNA.— Sandeep Parkhi (@sparkhi) October 9, 2025
Please wear the seat belt like the UK PM Keir Starmer is doing.
Photo optics can rest.
As a PM you need to set an example on safety and not on how to pose for photographs.— Krishna Kant Sharma (@krishnakant_75) October 9, 2025