Hardik Pandya : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో నాయకుడిగా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)కు జరిమానా పడింది. ఐపీఎల్ నియమావళిని (IPL Code Of Conduct) ఉల్లఘించినందుకు అతడు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోల్పోనున్నాడు. మ్యాచ్ సమయంలో క్రికెట్ వస్తువులు(బ్యాట్, బంతి, వికెట్లు, గ్లోవ్స్, బెయిల్స్) పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు అతడికి రిఫరీ రాజీవ్ సేథ్ జరిమానా విధించాడు.
అసలేం జరిగిందంటే.. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఢీకొన్నాయి. కోల్‌కతా ఇన్నింగ్స్ సమయంలో 10వ ఓవర్ వేసిన పాండ్యా.. నాలుగో బతికి రనప్ కోసం నడుచుకుంటూ వెళ్తూ చేతితో బెయిల్స్‌ను నెట్టేస్తున్నట్టు బలంగా తాకాడు. దాంతో, అవి కిందపడిపోయాడు. అతడి చర్యను తీవ్రంగా పరిగణించిన పాండ్యాను విచారణకు పలిచాడు రిఫరీ రాజీవ్ సేథ్.
ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2ను పాండ్యా ఉల్లంఘించాడని రిఫరీ తెలుపగా.. తాను నేరం చేశానని ముంబై కెప్టెన్ అంగీకరించాడు. దాంతో, రిఫరీ అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించాడు. ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించాడు. కోల్‌కతా చేతిలో ఘోర ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీజన్ ఆసాంతం పేలవ ఫీల్డింగ్ తమ కొంపముంచిందని పాండ్యా తెలిపాడు.
🚨 JUST IN 🚨
Hardik Pandya has been fined 10% of his match fee and accumulated one Demerit Point for breaching Article 2.2 of IPL’s Code of Conduct.
The incident during KKR’s chase, when Pandya, walking back to his run-up, knocked the bails of the wicket with force.#IPL2026… pic.twitter.com/j5BXhDQvxT
— Cricbuzz (@cricbuzz) May 21, 2026
ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 19వ సీజన్లో అనూహ్య తడబాటుతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. లీగ్ దశను హ్యాట్రిక్ విజయాలతో ముగిద్దామనుకుంటే కోల్‌కతా నైట్ రెడర్స్ ముంబైని దెబ్బకొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో హార్దిక్ పాండ్యా బృందాన్ని 147కే నిలువరించిన కేకేఆర్ స్వల్ప లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించి నాకౌట్ అవకాశాల్ని మెరుగుపరచుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో మే 24న ముంబై తలపడనుంది.