Hardik Pandya: లెగ్ స్పిన్నర్‌గా హార్దిక్ పాండ్యా.. స్పీడ్ బౌలర్‌గా సూర్యకుమార్ యాదవ్
Hardik Pandya: గంభీర్ మార్క్ కోచింగ్ మొదలైంది. ఇవాళ నెట్స్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. స్పిన్ బౌలింగ్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్.. స్పీడ్ బౌలర్‌గా అవతారమెత్తాడు. మరికొన్ని గంటల్లో లంకతో టీ20 మ్యాచ్ జరగనున్నది.
పల్లెకిలా: ఇవాళ శ్రీలంకతో భారత జట్టు తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. దీని ముందు భారత బృందం నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసింది. అయితే కొత్త కోచ్ గౌతం గంభీర్ తనదైన స్టయిల్లో క్రికెటర్లను టెస్ట్ చేశారు. ప్రాక్టీస్ టైంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఫాస్ట్ బౌలింగ్‌కు బదులుగా లెగ్ స్పిన్ ట్రై చేశాడు. నెట్ ప్రాక్టీస్‌లో అతను లెగ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. మాజీ లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేను అనుకరించే ప్రయత్నంచేశాడు. హార్దిక్ పాండ్యా లెగ్ స్పిన్ ట్యాలెంట్‌తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
Hardik wants to do it all 😂 pic.twitter.com/LgbXr7JOys
— Lucknow Super Giants (@LucknowIPL) July 26, 2024
కెప్టెన్ సూర్యకుమార్ కూడా బౌలర్ పాత్రను పోషించాడు. నెట్స్‌లో అతను స్పీడ్ బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్ కోసం అనుకోని రీతిలో హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టేసి సూర్యకు సారథ్య బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ అనుభవం లేకున్నా.. సెలెక్టర్లు సూర్యకే మొగ్గు చూపారు.
Yeh naya 𝙄𝙉𝘿𝙄𝘼 hai! 😉🇮🇳#SuryakumarYadav #HardikPandya #SLvIND #PunjabKings pic.twitter.com/mYMX7gkzCL
— Punjab Kings (@PunjabKingsIPL) July 27, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

