అహ్మదాబాద్: ఐపీఎల్ 2025(IPL 2025) ఫైనల్లోకి పంజాబ్ కింగ్స్ జట్టు ప్రవేశించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో అయిదు వికెట్ల తేడాతో పంబాజ్ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయాస్‌కు 24 లక్షల జరిమానా వేశారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు ఫైన్ వేశారు. ఆ జట్టులోకి సభ్యులకు 6 లక్షలు లేదా 25 శాతం మ్యాచ్ ఫీజులో కోతను విధించనున్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా ఫైన్ వేశారు. అతనికి 30 లక్షల జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్ జట్టులోని ఇతర సభ్యులకు 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వసూల్ చేయనున్నారు. పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ విరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అతను 41 బంతుల్లో 87 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2014లో పంజాబ్ ఫైనల్స్‌లో ఆడింది. మంగళవారం ఆర్సీబీతో టైటిల్ పోరులో పాల్గొనున్నది.
204 టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నది. జోష్ ఇంగ్లిస్ 21 బంతుల్లో 38, వదేరా 29 బంతుల్లో 48 రన్స్ చేసి కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయ్యర్, వదేరాలు కేవలం 7.5 ఓవర్లలో 84 రన్స్ జోడించి ముంబైని స్టన్ చేశారు. అయ్యర్ తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు బాదాడు.