Hardik Pandya : టీమిండియా టీ20 కెప్టెన్‌గా విజయవంతమైన హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ ఫైనల్లో గొప్ప రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఆడిన 5 ఫైనల్లో అతడు ట్రోఫీ సాధించాడు. అవును.. ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ ఇంతకుముందు 5 ఫైనల్స్ ఆడాడు. మొదట్లో ముంబై ఇండియన్స్ తరఫున పాండ్యా 4 ఫైనల్స్(2015, 2017, 2019, 2020) ఆడాడు. వాటన్నింటిలోనూ ముంబై కప్పు కొట్టింది.
15వ సీజన్లో ఫ్రాంఛైజీ మారిన అతను గుజరాత్‌ను ఫైనల్ చేర్చాడు. ఆరంగేట్రం సీజన్లోనే ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు. రాజస్థాల్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ ట్రోఫీ అందుకుంది. వరుసగా రెండో సారి అతడు గుజరాత్‌ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు. దాంతో, పాండ్యా డబుల్ హ్యాట్రిక్ కొడతాడా? లేదా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
పాండ్యా 2018లో ఐపీఎల్లో ఆరంగేట్రం చేశాడు. 2021 వరకు ముంబై ఇండియన్స్‌తోనే కొనసాగాడు. ఈ యంగ్ ఆల్‌రౌండర్‌కు ముంబై రూ.11 కోట్లు చెల్లించింది. అయితే.. వెన్నునొప్పి నుంచి కోలుకున్న తర్వాత అతను 2021లో పెద్దగా రాణించలేదు. ఫిట్నెస్ లేని అతడిని ముంబై వదులుకుంది. కానీ, 2022 మినీ వేలంలో గుజరాత్ పాండ్యాను ఏకంగా రూ. 15 కోట్లకు కొనుగోలు చేసింది. పాండ్యా ఇప్పటివరకు 122 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 30.11 సగటుతో 2,288 రన్స్ కొట్టాడు. వీటిలో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ టోర్నీలో అతను 174 ఫోర్లు, 123 సిక్స్‌లు బాదాడు.
ఐపీఎల్ 2023 ట్రోఫీతో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోనీ
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ న్యూస్. టాస్ సమయానికి స్టేడియంలో భారీ వర్షం మొదలైంది. దాంతో, మైదానం సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పేశారు. వర్షం ఇంకా కురుస్తూనే ఉండడంతో టాస్ ఆలస్యం కానుంది. వర్షం తగ్గాక అంపైర్లు మ్యాచ్ సాధ్యపడుతుందా? ఓవర్లు కుదించాలా? లేదంటే సూపర్ ఓవర్ ఆడించాలా? అనే విషయమై నిర్ణయానికి రానున్నారు. రిజర్వ డే రోజున టైటిల్ పోరు నిర్వహిచండంపై కూడా చర్చించనున్నారు.