వనపర్తి : రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త ( BRS Worker ) బజారు ఆంజనేయులు కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) ఆర్థిక భరోసా ( Financial Support )ను కల్పించారు. బాధిత కుటుంబానికి అందజేసిన ఐదు లక్షల రూపాయల చెక్‌ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar reddy )శనివారం అందజేశారు.
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామనాథపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బజారు ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. అతడి భార్య మనీషా, ఇద్దరు కూతుళ్లకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారని తెలిపారు.
కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి,ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న భార్య,ఇద్దరు పిల్లలు భవిష్యత్తు కోసం ఐదు లక్షల రూపాయలు అందజేశామన్నారు. భవిష్యత్‌ల ఓ ఇద్దరు కూతుళ్ల చదువులకు అన్ని విధాలుగా అండగా ఉంటాననని హామీ ఇచ్చారు.