Lewis Hamilton | మెర్సిడెజ్‌కు ఫార్మూలా వన్ దిగ్గజం గుడ్ బై.. ఆ కంపెనీ కోసమేనా..?
Lewis Hamilton : ఫార్ములా వన్ దిగ్గజం లెవిస్ హామిల్టన్(Lewis Hamilton) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ మెర్సిడెజ్(Mercedes) కంపెనీకి షాకిస్తూ.. 10 ఏండ్ల బంధానికి ముగింపు పలకనున్నాడు. నిరుడు ఏడాది పాటు తన మెర్సిడెజ్...
Lewis Hamilton : ఫార్ములా వన్ దిగ్గజం లెవిస్ హామిల్టన్(Lewis Hamilton) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రముఖ మెర్సిడెజ్(Mercedes) కంపెనీకి షాకిస్తూ.. 10 ఏండ్ల బంధానికి ముగింపు పలకనున్నాడు. నిరుడు ఏడాది పాటు తన మెర్సిడెజ్ కాంట్రాక్ట్‌ను పొడిగించిన ఈ స్టార్ రేసర్ కొత్త కంపెనీతో ఒప్పందానికి సిద్ధమవుతున్నాడు. రేసింగ్ కార్లకు పాపులర్ అయిన ఫెరారీ(Ferrari) కంపెనీతో హామిల్టన్ అగ్రిమెంట్ కుదుర్చుకునే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే ఇరువర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అన్నీ కుదిరితే 2026 వరకు ఈ లెజెండరీ రేసర్ ఫెరారీతో కొనసాగనున్నాడు. హామిల్టన్ స్థానంలో స్పెయిన్ డ్రైవర్ కార్లోస్ సైన్జ్ (Carlose Sainz) మెర్సిడెజ్ తరఫున బరిలోకి దిగనున్నాడు.
హామిల్టన్ రేసులో దిగాడంటే ఎంతటి మొనగాడైనా రెండో స్థానానికి పరిమితమవ్వాల్సిందే. ఫార్ములా వన్‌లో తిరుగులేని హామిల్టన్ రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు. మరోవైపు ఫెరారీ కంపెనీకి రేసింగ్ ట్రాక్‌పై ఘనమైన రికార్డు ఉంది. 1996 నుంచి ప్రతి సీజన్లో ఆ జట్టు టైటిల్ కొల్లగొట్టింది. మైఖేల్ షుమేకర్, సెబాస్టియన్ వెటెల్లు పలు ట్రోఫీలు గెలిచారు.
వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రోఫీతో హామిల్టన్

అయితే.. 2007 తర్వాత ఫెరారీ టీమ్ ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయింది. ఆ ఏడాది కిమి రైక్కొనెన్(Kimi Raikkonen) టైటిల్ సాధించాడు. దాంతో ఫెరారా మేనేజ్మెంట్ స్టార్ రేసర్ అయిన హామిల్టన్‌తో అగ్రిమెంట్ చేసుకునేందుకు సిద్దమైంది. జువాన్ ఫాంగినో తర్వాత మూడు జట్ల తరఫున చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన రెండో రేసర్‌గా హామిల్టన్ రికార్డు సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
- IND vs ENG 2nd Test | టాస్ గెలిచిన టీమిండియా.. సర్ఫరాజ్‌కు మరోసారి నిరాశే
- Ambajipeta Marriage Band | సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకు హైలెట్‌గా శరణ్య ప్రదీప్ యాక్టింగ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

