IPL 2025 : సొంత మైదానంలో ధాటిగా ఆడుతున్న గుజరాత్ టైటన్స్(Gujarat Titans)కు షాక్. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(38) ఔటయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన గిల్‌ను ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బోల్తా కొట్టించాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో గిల్ ఆడిన బంతిని నమన్ ధిర్ ఒడుపుగా క్యాచ్ అందుకున్నాడు. దాంతో, తొలి వికెట్ భాగస్వామ్యానికి 78 పరుగుల వద్ద తెరపడింది. ప్రస్తుతం సాయు సుదర్శన్(28), జోస్ బట్లర్(13) ఆడుతున్నారు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్.. 92-1.
టాస్ ఓడినప్పటికి గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(38), సాయిసుదర్శన్(28)లు ధాటిగా ఆడారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ ఆఖరి బంతిని గిల్ బౌండరీకి పంపాడు. రెండో ఓవర్లోనే ఒకటే ఫోర్ వచ్చింది. అయితే.. మూడో ఓవర్లో బౌల్ట్ లక్ష్యంగా.. రెండు బౌండరీలు సాధించాడు సుదర్శన్. ఇక ముజీబ్ బౌలింగ్‌లో ఈ యంగ్‌స్టర్ 4, 6, 4 బాదాడు.. క్రీజులో పాతుకుపోయిన ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
When your plan works to perfection 😌
Hardik Pandya wins the captains’ battle against Shubman Gill 💪
Updates ▶ https://t.co/lDF4SwmX6j #TATAIPL | #GTvMI | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/HnkSxFdpFR
— IndianPremierLeague (@IPL) March 29, 2025
దాంతో, పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 66 పరుగులు చేసింది గుజరాత్. ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని విడదీసేందుకు హార్దిక్ పాండ్యా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కానీ, యంగ్‌స్టర్స్ ఇద్దరూ ఆత్మవిశ్వాసంగా ఆడడంతో.. చివరకు తనే బౌలింగ్‌కు దిగి గిల్‌ను వెనక్కి పంపాడు. 78 వద్ద తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్‌కు సుదర్శన్, బట్లర్(13)లు భారీ స్కోర్ అందించే పనిలో ఉన్నారు.