న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్సింగ్ మరోమారు సత్తాచాటాడు. బోస్టన్(అమెరికా) వేదికగా జరుగుతున్న ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏషియన్ రికార్డుతో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ టోర్నీకి అర్హత సాధించాడు. శనివారం జరిగిన 5000మీటర్ల రేసును గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్ల వ్యవధిలో పూర్తి చేశాడు. ఈ క్రమంలో 13 నిమిషాల్లోపు రేసు ముగించిన తొలి భారత అథ్లెట్‌గా నిలువడంతో పాటు థాయ్‌లాండ్ అథ్లెట్ కీరన్ టునివెట్(13:08:41సె) పేరిట ఉన్న రికార్డును తిరుగరాశాడు. ఈ క్రమంలో టోక్యో వేదికగా సెప్టెంబర్ 13 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి పోటీపడనున్నాడు.