Gulveer Singh | రికార్డు పరుగు.. 16 ఏండ్ల ఫీట్ బద్దలుకొట్టిన గుల్వీర్సింగ్
ఆసియా గేమ్స్ కాంస్య విజేత గుల్వీర్సింగ్ మరోమారు సత్తాచాటాడు. కాలిఫోర్నియా వేదికగా పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీలో గుల్వీర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
Gulveer Singh | న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్ కాంస్య విజేత గుల్వీర్సింగ్ మరోమారు సత్తాచాటాడు. కాలిఫోర్నియా వేదికగా పారిస్ ఒలింపిక్స్ అర్హత టోర్నీలో గుల్వీర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఆదివారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసును గుల్వీర్ 27.41.81 సెకన్ల టైమింగ్‌తో ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 16 ఏండ్ల క్రితం సురేంద్రసింగ్ నెలకొల్పిన రికార్డు (28.02.89సె)ను గుల్వీర్ అధిగమించాడు.
20 సెకన్ల తేడాతో కొత్త రికార్డు అందుకున్న గుల్వీర్..పారిస్ ఒలింపిక్స్ అర్హత టైమింగ్ (27.00.00)ను అందుకోలేకపోయాడు. మరోవైపు భారత్‌కే చెందిన కార్తీక్‌కుమార్ (28.01.90 సె) తొమ్మిదో స్థానంలో నిలువగా, అవినాశ్ సాబ్లే 6వేల మార్క్ వద్ద పరుగును ముగించాడు. మహిళల విభాగంలో పారుల్ చౌదరీ (32.02.08) పారిస్ విశ్వక్రీడలకు అర్హత సాధించలేకపోయింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

